NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హన్సిక పేరు శృతి అట..

1 min read

సినిమా డెస్క్​ : ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటిస్తున్న హన్సిక ‘మహా’ అనే క్రైమ్ థ్రిల్లర్ తో తన కెరీర్ లో యాభై సినిమాలు కంప్లీట్ చేసింది. తాజాగా ఓ తెలుగు సినిమాకి సైన్ చేసింది. ‘మై నేమ్ ఈజ్ శృతి’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం నిన్న ఉదయం ఫిల్మ్ నగర్ లో ప్రారంభమైంది. తెలుగులో తనకిదే ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ సినిమా. శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. రమ్య బురుగు, నాగేందర్ రాజు నిర్మాత. ఈ చిత్రం గురించి హన్సిక మాట్లాడుతూ ‘తెలుగు సినిమాలే నన్ను హీరోయిన్ ని చేశాయి. అలాంటి తెలుగులో మరో మంచి చిత్రం చేస్తున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. ఇందులో శృతి అనే ఇండిపెండెంట్ గర్ల్ గా నటిస్తున్నాను. రెగ్యులర్ థ్రిల్లర్స్ కి భిన్నంగా ఊహకందని ఆసక్తికర మలుపులు ఈ చిత్రంలో ఉంటాయి. ఆ కొత్తదనం నచ్చడంతోనే ఈ సినిమాకి సైన్ చేశాను’ అని చెప్పింది. హన్సికకి జంటగా సాయితేజ నటిస్తున్నాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉన్నట్టే, ప్రతి అమ్మాయి సంఘర్షణ వెనుక ఓ మగాడు ఉంటాడు. అలాంటి సంఘర్షణని ఎదుర్కొన్న ఓ అమ్మాయి, తనను తాను ఎలా కాపాడుకుంది అన్నదే ఈ సినిమా కథ. మురళీ శర్మ, ఆర్.నారాయణన్, జయప్రకాష్, వినోదిని, పూజారామచంద్రన్, రాజీవ్ కనకాల ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించనున్నాడు.

About Author