NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈనెల 13 నుండి 17 వరకు హనుమజ్జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ఏలూరు జిల్లా. జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామములొ స్వయంభువులై వెలిసిన శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానము నందు 13.05.2023 తేదీ స్థిరవారం నుండి 17.05.2023 తేదీ బుదవారం వరకు శ్రీ హనుమద్ జయంతి సహిత కల్యాణ మహోత్సవములు అత్యంత వైభవముగా నిర్వహింపబడున నాని కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమ వివరములు.
ది.13.05.2023 వ తేది:-స్థిరవారం ఉదయం గం.5.00 ల నుండి శ్రీమద్ది ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు, నిజరూప సందర్శనం, సాయంత్రం గం. 6.00 లకు యాగశాల ప్రవేశం, ద్వజారోహణ, బలిహారములు అగ్నిప్రతిష్ట, అంకురార్పణ. ది.14.05.2023 వ తేది:- ఆదివారం హనుమద్ జయంతి మహోత్సవము, ఉదయం గం.5.00 లనుండి శ్రీ స్వామి వారికి పంచామృత అభిషేకములు, లక్ష తమల పాకులతో పూజా కార్యక్రమం, తదుపరి ప్రత్యేక పూజలు హోమ కార్యక్రమము. ది.15.05.2023 వతేది:- సోమవారం ఉదయం గం.9.00 లనుండి శ్రీ సువర్చలా సమేత హనుమత్ కల్యాణం నిర్వహించబడును. తదుపరి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమములు నిర్వహించబడును. సా. గం.6.00 ల నుండి గ్రామోత్సవం నిర్వహించబడును.ది.16.05.2023 వ తేది:- మంగళవారం ఉదయం గం.9.00 లనుండి అలివేలుమంగ, పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి వార్షిక కల్యాణం, ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమములు నిర్వహించబడును.ది.17.05.2023 వ తేది:- బుదవారం ఉదయం గం.5.00 లనుండి ప్రత్యేక పూజలు, హోమకార్యక్రమములు, పూర్ణాహుతి కార్యక్రమములు అనంతరం శ్రీ స్వామి వారి పుష్కరిణిలో చక్రస్నానం, సాయంత్రం గం.7.00 లకు తెప్పోత్సవం నిర్వహించబడును. సదరు పూజా కార్యక్రమములకు భక్తులు యావన్మంది విచ్చేసి శ్రీ స్వామివార్లను అమ్మవార్లను దర్శించి, తీర్ధ ప్రసాదములు స్వీకరించవలసినదిగా ఆలయ చైర్ పర్సన్ శ్రీమతి కీసరి సరిత విజయభాస్కర రెడ్డి, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేసినారు.

About Author