NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈ నెల 14న హనుమజ్జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె:  తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో బనగానపల్లి పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమజ్జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ధర్మ ప్రచార మండలి సభ్యులు డాక్టర్ గాదంశెట్టి రవికుమార్, విశ్వహిందూ పరిషత్ ప్రఖండ కార్యదర్శి గెలగాని ఓబుల రెడ్డి, జిల్లా సహకార్యదర్శి కిషోర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు వారు మాట్లాడుతూ హనుమజ్జయంతి సందర్భంగా ఈ నెల 14న ఉదయం పంచామృతాభిషేకం, ఆకుపూజ, సుందరాకాండ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం,  తీర్థప్రసాద గోష్ఠి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీలర్ సంకేపల్లి దస్తగిరి రెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గాదంశెట్టి వేణుగోపాల్, హెందవ ఉత్సవ సమితి ప్రముఖ్ సిద్దమోని యాదగిరి, శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం కోశాధికారి సముద్రాల చక్రపాణి, అమ్మవారిశాల సంయుక్త కార్యదర్శి గుండా రవికుమార్, బింగుమళ్ళ హనుమాన్, సమరసతా సేవా ఫౌండేషన్ ప్రతినిధులు బి.నాగమల్లారెడ్డి, జి.శంకరయ్య, ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు జెక్కా నాగరాజు, వి.హెచ్.పి. బనగానపల్లి అధ్యక్షులు వి.రమణారెడ్డి, క్లాత్ మర్చంట్ అసోసియేషన్ సెక్రటరీ ఇటిక్యాల సాయిరాంతో పాటు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author