వైభవం.. హనుమాన్ శోభాయాత్ర ..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : పరమ పవిత్రమైన “వీర హనుమాన్ విజయ శోభాయాత్ర” లో శ్రీరాముని బంటు.. నిజమైన హిందూ కార్యకర్త హనుమంతుడు జన్మించిన సందర్భంగా నిర్వహించే ఈ “హనుమజ్జయంతి” చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఉరకలెత్తే యువకులు కాషాయం ధ్వజాలు, కండువాలు ధరించి కదం తొక్కారు. కర్నూలు పాత నగరం లలితా పీఠం నుంచి బుధవార పేటలోని ఓం శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం వరకు ఈ శోభాయాత్ర కొనసాగింది. విశ్వహిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు టి.సీ. మద్దిలేటి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశెట్టి వెంకటరామయ్య, ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి, కోశాధ్యక్షులు సందడి మహేశ్వర్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్, విశేష సంపర్క విభాగం కన్వీనర్ ప్రతాపరెడ్డి, గౌరవ పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, భా జ పా నాయకులు ఖగ్గోలు హరీష్ బాబు, వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి , దండు శేషు యాదవ్ , రాష్ట్ర టోలీ సభ్యులు గోరంట్ల రమణమరియు లలితా పీఠం వ్యవస్థాపకులు సుబ్బిస్వామి ” మహా మంగళహారతి” చేసి ” వీర హనుమాన్ విజయ శోభాయాత్ర” ను ప్రారంభించారు. ఈ శోభాయాత్ర పాత నగరం జమ్మి చెట్టు నుండి చిత్తారివీధి కూడలి, ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ మీదుగా పూల బజార్, మించిన బజార్, పాత బస్టాండ్ అంబేద్కర్ కూడలి, మీదుగా కొండారెడ్డి బురుజు , కాంగ్రెస్ కార్యాలయం, కోట్ల కూడలి మీదుగా కిడ్స్ వరల్డ్ నుండి వివేకానంద కూడలి మీదుగా బుధవారపేటలోని ఓం శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి చేరింది.
