PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్యంత వైభవంగా హనుమజ్జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె:  తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో బనగానపల్లి, కొండపేట పెద్దాంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమంతుని జన్మదిన వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం పంచామృతాభిషేకం, ఆకుపూజ, డాక్టర్ బోలుగద్దె అనిల్ కుమార్ చే సుందరాకాండ సంపూర్ణ పారాయణం, స్థానిక భక్త సమాజంచే హనుమాన్ చాలీసా పారాయణం, భక్తులందరికీ అన్నదానం చేశారు . ఈ సందర్భంగా వక్తలు హనుమంతుని వైభవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  సాయంత్రం జరిగిన హనుమంతుని శోభాయాత్రలో వివిధ కుల సంఘాల నాయకులు ధార్మిక సంస్థల ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author