ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిని అభినందించిన హనుమంతరావుచౌదరి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయంసాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి , ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందన ఆలపాటి రాజా , ఉమ్మడి గోదావరి జిల్లాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీగా గెలుపొందిన వారిని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన మద్దతు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 9 నెలల కాలంలో ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ పరిపాలనకు మెచ్చి పట్టభద్రులు ఇచ్చిన తీర్పు అని అన్నారు. రాబోవు రోజులలో ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలపాలని, ఎన్నికలలో ప్రకటించిన పథకాలను ప్రజలకు చేరే విధంగా తెలియజేయాలని హనుమంతరావు చౌదరి, ఆర్గనైజర్ సెక్రెటరీ లక్ష్మీ పద్మా చౌదరి కోరారు.