PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముచ్చటగా మూడో సినిమా..

1 min read

సినిమా డెస్క్​: అటు మాస్‌ని, ఇటు క్లాస్‌ని మెప్పించే హీరో గోపీచంద్. కొద్ది రోజులుగా వరుస ఫ్లాప్‌లనే ఎదుర్కొంటున్న వాటితో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాకి సైన్‌ చేశాడు. గోపీచంద్ ప్రస్తుతం తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీటీమార్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మారుతి దర్శకత్వంలో నటిస్తున్న ‘పక్కా కమర్షియల్’ షూటింగ్ జరుగుతోంది. ఇవి ఇలా ఉండగానే లక్ష్యం, లౌక్యం మూవీలతో తన కెరీర్‌‌లో బిగ్గెస్ట్ హిట్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌‌ శ్రీవాస్‌తో మరో చిత్రానికి కమిటయ్యాడు. నిన్న ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇది తన ముప్ఫయ్యో సినిమా. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాత. భూపతిరాజా కథని అందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. త్వరలోనే ఈ సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లనున్నాడు గోపీచంద్.

About Author