పింఛన్ దారుల కళ్ళల్లో ఆనందం..
1 min readబొల్లవరంలో పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పింఛన్ దారుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నందికొట్కూరు మండల పరిధిలోని 10.బొల్లవరం గ్రామంలో మంగళవారం పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.గ్రామంలో ఉన్న వృద్ధులకు 4 వేలు,దివ్యాంగులకు 6 వేల రూపాయల పింఛన్ల నగదును వారి ఇండ్లకు వెళ్లి అందజేశారు.చెప్పిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే విడతల వారీగా కాకుండా ఒకేసారి పింఛన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే అన్నారు.తర్వాత పెన్షన్ దారులతో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నల్లమల రవికుమార్,మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి,మిడుతూరు మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,పలుచాని మహేశ్వర్ రెడ్డి,, లక్ష్మీనారాయణ రెడ్డి,సుందర్ రెడ్డి,వివేకానంద రెడ్డి,నల్లమల్ల ఆనంద్,జనసేన పార్టీ నవీన్ రెడ్డి,షాలుమియా, రామచంద్రుడు,తిప్పారెడ్డి, మండల అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శి నూరుల్లా పాల్గొన్నారు.