NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా బాబా సహేబ్ అంబేడ్కర్ 133వ జయంతి

1 min read

నిర్వహించుకున్న గ్రామ ప్రజలు .. యువకులు

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో ఈ రోజు ఎల్లార్తి గ్రామం పెద్దలు మరియు యువత ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.బాబా సహేబ్ అంబేడ్కర్  133వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గ్రామ పెద్దలు యువత అంబేడ్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ అనే నినాదంతో యువతలో ఉత్సాహం నింపి భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశ మొట్టమొదటి న్యాయ శాఖామంత్రి వర్యులు బాబా సహేబ్ అంబేడ్కర్  చిన్నప్పటి నుంచి తను ఒక స్థాయికి ఎదగడానికి పడిన కష్టాలకు ప్రతి ఫలంగా ఈ రోజు మన దేశంలో గర్వంగా తలెత్తుకుని తిరిగే విధంగా చేసినటువంటి సంవిదాన శిల్పి  అడుగుజాడల్లో నడవాలనీ ఆయన ఆశయాలను కొనసాగించావనీ గ్రామ ప్రజలు కొనియాడారు.

About Author