NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా శ్రీ శ్రీ పెద్దమ్మ 13వ వార్షికోత్సవం   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణంలోని ఉప్పర కట్ట వద్ద వెలసిన శ్రీ శ్రీ పెద్దమ్మ 13వ వార్షికోత్సవాలు భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. శ్రీ శ్రీ పెద్దమ్మ అవ్వకు కుంకుమార్చనలు, గణపతి పూజ, పంచామృతాభిషేకాలతో, పండితుల మంత్రోచ్ఛారణలతో, అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ పెద్దమ్మ మూలవిరాట్ కు రకరకాల పువ్వులు పట్టు వస్త్రాలతో అలంకరించి మహిళ భక్తులు భక్తి పారవశ్యం తో మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

About Author