ఘనంగా టిడిపి 42వ ఆవిర్భావ దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల లోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల తెలుగుదేశం నాయకులు మండల కన్వీనర్ నజీర్, కార్యదర్శి తిరుపతయ్య, నాయకులు శ్రీధర్ నాయుడు, యూనోస్, రమేష్ నాయుడు, చెన్నల్ రాయుడు, అడ్వకేట్ చంద్రశేఖర్, బాబు నాయుడు, రామాంజనేయులు రంగస్వామి లు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు సినిమా రంగంలో నటసార్వభౌముడిగా, రాజకీయలలో అఖండఖ్యాతిని సంపాదించారని ఆయన బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసమే తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ కల్పించే సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లో ప్రవేశించి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఆవిష్కరించారని తెలుగు ప్రజల గుండెల్లో, తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో చైతన్య రథం ఎక్కి ఎండనక్క వాననకా దుమ్ము ధూళిని లెక్కచేయకుండా తెలుగు నేలను నలుదిక్కల చుట్టూ కాకుండా పేద బడుగు బలహీన వర్గాలకు పార్టీలో చోటు కల్పించి పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్నికల్లో గల విజయం సాధించి అధికారం చేపట్టిన మహా మనిషి ప్రజల మనిషి అని కొనియాడారు. అనంతరం స్వీట్లు ఒకరినొకరు పంచుకున్నారు. అలాగే మండలంలోని గంజిహళ్లి తిప్పనూరు తదితర గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.