దేశప్రజలకు 74వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: దేశ ప్రజలకు 74 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ , స్టేట్ జాయింట్ సెక్రటరీ’ మరియు రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (అంబేద్కర్), రాష్ట్ర ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు ‘అమీన్ బాయ్ ముఖ్య అతిథిలుగా పిట్ట వర ప్రసాద్ , పిళ్ల శ్రీనివాస్ విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా అమీన్ బాయ్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేసి రాజమండ్రిలో తన సంస్థ ఉద్యోగులతో జాతీయ జెండా ఆవిష్కరణ చేసినారు. అనంతరం జాతీయ గీతం జనగణమణ ఆలపించి, గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత తెలియచేసారు. రెండు శతాబ్దాలకు పైగా బ్రిటీష్‌వారి చెరలో మగ్గిన ఎందరో మహానుభావుల త్యాగఫలంతో ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం సిద్ధించింది. బ్రిటీషు వారు చట్టాలను పక్కనపెట్టి సొంతంగా భారత్‌కు ప్రత్యేక రాజ్యాంగం తీసుకొచ్చారు. డాక్టర్ బి.ఆర్ .అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అన్నారు. ఆ రాజ్యాంగం అమలుపరిచిన రోజే జనవరి 26 తేదీరిపబ్లిక్ డే అన్నారు. దేశ ప్రజలకు అతిథులకు,రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు తదితరులుపాల్గొన్నారు.