PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా సాధకుడు.. జననేతకు జన్మదిన శుభాకాంక్షలు

1 min read

పండుగలా ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో: రాయచోటి జిల్లా సాధకుడు, జననేత ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజక వర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఊరువాడ జరుగుచున్నాయి. నియోజక వర్గ పరిధిలో పలు సేవా కార్యక్రమాలను అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టారు.

సంబేపల్లె లో రక్తదానం..

మండల కేంద్రమైన సంబేపల్లెలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నియోజవర్గం,  మండలాల వ్యాప్తంగా యువకులు పెద్దఎత్తున రక్తదానంలో పాల్గొన్నారు.40 మందికి పైగా రక్త దాతలు రక్తదానం చేశారు.రక్తదాతలును డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి,సర్పంచుల సంఘ జిల్లా అధ్యక్షుడు చిదంబర్ రెడ్డి, మండల కన్వీనర్ ఉదయ్ కుమార్ రెడ్డి,వైస్ ఎంపిపి పొత్తూరి రవీంద్ర నాయుడు,  జెసిఎస్ మండల కన్వీనర్ వడ్డీ వెంకట రమణా రెడ్డి  తదితర సర్పంచులు, ఎంపిటిసి లు,నాయకులు అభినందించారు.

రాయచోటి పట్టణంలో…

●పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో మదనపల్లె పరిశీలకులు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేసి కార్యకర్తలు, అభిమానులు సంబరాలు నిర్వహించారు.

 ●రాయచోటి ప్రభుత్వాస్పత్రిలో  వైఎస్ఆర్ సిపి మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, రోగి సహాయకులకు అన్నదానం నిర్వహించారు.

●పలుచోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ లు జరిపారు.

లక్కిరెడ్డిపల్లె లో ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్,

బండపల్లె ప్రేమాలయంలో లక్కిరెడ్డిపల్లె  ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, రాయచోటి కొత్తపేట కౌన్సిలర్ కసిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి ల ఆధ్వర్యంలో  వృద్ధులుకు మూడు పూటలా అన్నదాన కార్యక్రమాలు…

గాలివీడు లో…

 గాలివీడు ఎంపిపి కార్యాలయంలోనూ, పలు గ్రామ సచివాలయాలలోనూ కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.

నిండు నూరేళ్లు.. ఆయురారోగ్యాలతో జీవించాలి…

ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి భగవంతుడి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా జీవించాలని నియోజక వర్గ వ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. జన్మదినోత్సవం సందర్భంగా పలు ఆలయాలలో పూజలు నిర్వహించారు.

About Author