ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్ బ్రమరాంభిక అధ్యక్షతన “రాజ్యాంగ దినోత్సవం” ఆదివారం ఘనంగా నిర్వహించారు.మొదట ప్రధానోపాధ్యాయురాలు వెంకమ్మ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకమ్మ మాట్లాడుతూ, దేశప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌబ్రా తృత్వం అందింస్తూ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బాధ్యత గల పౌరులుగా మెలగుదామని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఫలాలను సమానంగా అనుభవిద్దామని ఆమె చెప్పారు.సోషల్ టీచర్ బ్రమరాంభ మేడం మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మనది అని,దానిని గౌరవించుకోవలసిన బాధ్యత,పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నదని సూచించారు. విద్యార్థినిలు మాక్ పార్లమెంట్ నిర్వహించి సబికులను ఆలరించారు. అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఈ సందర్భంగా విద్యార్థినిలు ప్రదర్శించి మెప్పించారు.ఈ కార్యక్రమంలో వనజా మేడం, శ్యామలా మేడం , కొత్తపల్లి సత్యనాాయణ మరియు ఉపాధ్యాయినిలు,విద్యార్థినిలు పాల్గొన్నారు.