PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా స్నేహితుల దినోత్సవం..

1 min read

పల్లెవెలుగు వెబ్ ​పత్తికొండ: స్నేహితుల దినోత్సవాన్ని పత్తికొండలో ఆదివారం యువ స్పందన  మిత్రబృందం   ఘనంగా నిర్వహించారు. స్థానిక హోసూరు రోడ్డులోని  ఆర్టీడీఎస్ వృద్ధాశ్ర మంలో   స్నేహితుల దినోత్సవం సందర్బంగా కేక్ కట్ చేసి వృద్ధులకు బ్రేడ్లు పంపిణీ చేశారు.  యువస్పందన మిత్రబృందం లక్ష్మన్న, తులశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. స్నేహితుల దినోత్సవం సందర్బంగా వృద్దులతో తమ మిత్రులందరు కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం రైతుల దినోత్సవం సందర్భంగా  ఏదో ఒక కార్యక్రమం జరుపుతామని వివరించారు.  అనంతరం స్నేహితులు, వృద్ధులు  ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ ను కట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో యువ స్పందన మిత్ర బృందం వెంకటేష్ నాయక్,  మధుబాబు, రమేష్, ఇస్మాయిల్,  ఆర్మీ రాజు,లక్ష్మీనారాయణ, జయకృష్ణ, సూరి, బాషా తదితరులు పాల్గొన్నారు .

About Author