జిల్లా ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు…
1 min read
మత సామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోళి పండగ జరుపుకోవాలి.
ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా ఇబ్బంది కలిగించవద్దు.
జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ .
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ మత సామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోళి పండగ జరుపుకోవాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా పండుగ జరుపుకోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని ఎస్పి విజ్ఞప్తి చేశారు.