PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందికొట్కూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉమెన్స్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఆర్. సునీత అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా కర్నూలు ప్రముఖ న్యాయవాది వి. నాగలక్ష్మి దేవి , కర్నూలు ఆలయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ జిల్లా క్యాబినెట్ సెక్రటరీ డాక్టర్ నైలా తబస్సుమ్ , నందికొట్కూరు మున్సిపల్ మేనేజర్ ఎస్. బేబీ విచ్చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. సునీత మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళ్లే అవకాశాలు ఎన్నో ఉన్నాయని ధైర్యంగా ప్రతి స్త్రీ అభివృద్ధి మార్గంలో ముందుకెళ్లాలని తెలిపారు. ప్రముఖ న్యాయవాది వి. నాగలక్ష్మి దేవి మాట్లాడుతూ న్యాయపరంగా స్త్రీలు తెలుసుకోవాల్సిన చట్టాలను గురించి పరిపూర్ణమైన అవగాహన కలిగించి చట్టం ఎప్పటికీ స్త్రీల రక్షణ కోసం సిద్ధంగా ఉందని ప్రతి స్త్రీ తాను తన జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవడంలో ఎప్పటికీ వెనకాడకూడదని తెలిపారు. ఆలయన్స్ క్లబ్ జిల్లా సెక్రెటరీ డాక్టర్ నైలా తపస్సుమ్ మాట్లాడుతూ పురాతన కాలం నుంచి స్త్రీలు పురుషులతో సమానమైన అవకాశాలను పొందలేకపో తున్నారని,నేటి మహిళా ఐక్యరాజ్యసమితి 2023లో ప్రకటించినట్లు డిజిటల్ స్త్రీగా మారే అవకాశాలు ఉన్నాయని, మహిళలుసాంకేతిక శాస్త్రీయ రంగాల్లో మరింత ప్రగతి సాధించాలని తెలిపారు. నందికొట్కూరు మున్సిపల్ మేనేజర్ బేబి మాట్లాడుతూ స్త్రీలు ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందుతూ వారి సమస్యలను స్వయంగా తీర్చుకోగలిగే శక్తిని సంపాదించాలని తమ మున్సిపల్ సేవలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎల్లప్పుడూ అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు .డబ్ల్యూ ఈ సి కన్వీనర్ డాక్టర్ ఎం. అమరావతి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్త్రీలలో ఒక స్ఫూర్తి కలుగుతుందని, మహిళ సాధికారిక అభివృద్ధికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందికొట్కూరు ఎప్పుడు కృషి చేయడంలో ముందుంటుందని తెలిపారు .కార్యక్రమంలో డబ్ల్యూ ఈ సి సభ్యులు టి ఝాన్సీ రాణి, వి. చిట్టమ్మ ,సి. సుమలత ,ఈ. లక్ష్మీదేవి మొదలైన వారు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అధ్యాపకేతరులు విద్యార్థులు పాల్గొని వారి అభిప్రాయాలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిపిన వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థినులకు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ వ్యాసరచన పోటీలు, డాన్స్ పోటీలు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీలలో విజయం సాధించిన వారికి ప్రశంసా పత్రాలను ప్రిన్సిపాల్ చేతుల మీదుగా అందజేశారు.

About Author