ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం …
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ శాంతి టాలెంట్ స్కూల్ లో శుక్రవారం గణిత శాస్త్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు.మొదట శ్రీనివాస రామానుజం అయ్యన్ గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని గణిత దినోత్సవం నిర్వహిస్తారని పాఠశాల హెచ్.యం.విజయ లక్ష్మి తెలిపారు. మన భారతీయ గణిత శాస్త్ర వేత్త,గణిత మేధావి శ్రీనవాస రామానుజన్ అతి స్వల్పకాలం జీవించి ,ఇండియాకు గౌరవ ప్రతిష్టలను తన ప్రతిభా పాటవాలతో విశ్వవ్యాప్తం చేసిన గొప్ప శాస్త్ర వేత్త అని అన్నారు.వీరిని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో చిన్నారులు అనేక రకాల గణిత నమూనాలను ప్రదర్శించారు.విద్యార్థినీలు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆల రించాయి.ఈ కార్యక్రమంలో గణిత ఉపాద్యాయులు రహంతుల్లా,ఈశ్వరి మరియు ఉపాధ్యాయిని, ఉపాద్యాయులు విద్యార్తిని, విద్యార్థులు పాల్గొన్నారు.