ఘనంగా మొల్లమాంబ జయంతి…
1 min read
యువతకు,విద్యార్థులకు కవయిత్రి మొల్ల మాంబ జీవితం ఆదర్శం
తెలుగులో తొలి కావ్యం రచించిన రచయిత్రి మొల్ల మాంబ
మొల్లమాంబ చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కవయిత్రి మొల్ల మాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత విద్యార్థిని విద్యార్థులు స్ఫూర్తి పొందాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్ధానిక కలెక్టర్ బంగ్లా సమావేశ మందిరంలో కవయిత్రి మొల్ల జయంతిని ఘనంగా నిర్వహించారు. కవయిత్రి మొల్ల చిత్రపటానికి కలెక్టర్ వెట్రిసెల్వి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొల్ల జయంతిని అధికారంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసి ఉందన్నారు. రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా తక్కువ వ్యవధిలో రచించిన గొప్ప కవయిత్రి అని కొనియాడారు. ఆనాటి పరిస్థితులను ఎదుర్కొని సాహసోపేతంగా రామాయణం రచించారని అన్నారు. మారుమూల ప్రాంతం నుండి నుండి వచ్చిన కవియత్రి అని ఆమె పేరుతో ప్రభుత్వం స్టాంప్ కూడా రిలీజ్ చేసిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి ఆర్.వి.నాగరాణి, బి.సి. కార్పోరేషన్ ఎడి ఎన్. పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.