ముస్లిం సోదరులకు షబ్-ఎ-బరాత్ శుభాకాంక్షలు
1 min read– జిల్లా మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: షబ్-ఎ-బరాత్ ముస్లిం సమాజం ప్రధాన పండుగలలో ఒకటి. ఇది ఆరాధన రాత్రి ప్రతి సంవత్సరం షాబాన్ 14వ తేదీన సూర్యాస్తమయం తర్వాత షబ్-ఎ-బారాత్ రాత్రి ప్రారంభమవుతుంది.అన్నమయ్య జిల్లా మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ జిల్లా ముస్లిం సోదరులకు పేరు పేరునా షబ్-ఎ-బరాత్ శుభాకాక్షలుతెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ షబ్ అంటే రాత్రి బరాత్ అంటే అమాయకత్వం. షబ్-ఎ-బరాత్ రోజున, మరణించిన పూర్వీకుల సమాధులను వారి ప్రియమైన వారిచే వెలిగిస్తూ , ప్రార్థనలు చేస్తారు. నమ్మకం ప్రకారం, ఈ రాత్రి అల్లాహ్ తన ప్రియమైన వారితో లెక్కలు తేల్చడానికి వస్తాడు. ఈ రోజున ఎవరైనా తన పాపాలకు క్షమాపణ కోసం అల్లాహ్‌ను హృదయపూర్వకంగా అడుగుతారు. రాత్రంతా మేల్కొని, అల్లాహ్ను ఆరాధించే రోజు అని గుర్తు చేశారు.