జిఓ 117 ను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం సంతోషం
1 min read
మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి కలిసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్
మంత్రాలయం న్యూస్ నేడు : – జిఓ 117 ను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం చాలా సంతోషంగా ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో టిడిపి కార్యాలయంలో మంత్రాలయం,పెద్దకడుబుర్, కోసిగి, కౌతాళం మండలాలలో గల పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి మౌలిక వసతులు ఉపాధ్యాయుల కొరత తదితరు అంశాలపై క్యాంపు కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎంఈఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారికి నాలుగు మండలాల యంఈఓ లకు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి మండలంలోని పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు తాగునీరు మరుగుదొడ్లు సమస్య లేకుండా చూడాలన్నారు. అలాగే ఎక్కడైనా టీచర్ల కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని అన్నారు. పాఠశాలలు భవనాలు శిధిలావస్థలో ఉంటే వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించేందుకు ప్రతిపాదనలు తమకు తెలియచేయాలనీ సూచించారు.అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ జిఓ 117 రద్దు చేసినందుకు కూటమి ధన్యవాదలు తెలియచేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యంఈఓ లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.