ఘణంగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
1 min read
పల్లెవెలుగు , కర్నూలు: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ బి.లీలా వెంకట శేషాద్రి ఈ రోజు అనగా 20-02-2025 న స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఫర్ మెన్ బి.క్యాంపు,కర్నూలు నందు ప్రపంచ సామజిక న్యాయ దినోత్సవాన్ని ఘణంగా నిర్వహించారు . జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి మాట్లడుతు సామాజిక న్యాయాన్ని ఆ కాoక్షి స్తూ ఫిబ్రవరి 20 న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు . ఈ రోజును పేదరికం, లింగ సమానత్వం, నిరుద్యోగం, మానవ హక్కులు, సామాజిక రక్షన వంటి సమస్య లను పరిష్కరించ డం కోసం జరుపు కుంటున్నామని తెలిపారు.ప్రజా వినియోగ సేవల కోసం శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షులు శ్రీ వెంకట హరినాథ్ పలు రంగాలకు సంబంధించి ఎలాంటి సేవలలో లోపంగానీ, నష్టంగానీ, అన్యాయంగానీ జరిగితే తక్షణమే పర్మనెంట్ లోక్ అదాలత్, కర్నూలు వారికీ వినతిపత్రంతో పాటు, తగిన ఆధారాలతో సమర్పించాలని తెలిపారు . ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా అతి తక్కువ సమయంలో న్యాయం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎమ్. ఇందిర శాంతి , వైస్ ప్రిన్సిపల్స్ సత్యనారాయణ మరియు హేమంత్ , డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, లెక్చరర్ రోహన్న, నాగరత్న కాలేజీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.