ఉపాధ్యాయులను వేధించడం తగదు… ఆపస్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఫార్మేటివ్ పరీక్షల మూల్యాంకనం సరిగా చేయలేదని, వర్క్ బుక్ లో రాయించలేదని, నోట్స్ సరిగా కరెక్షన్ చేయలేదని, బైజూస్ యాప్ పిల్లలు వాడడం లేదని, యూనిఫాం,బూట్లు, గైర్ హాజర్, ఆధార్ లేకపోవడం లాంటి రకరకాల కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలోని పర్యవేక్షణ అధికారులు పాఠశాలల్లోని ఉపాధ్యాయులను అన్నింటికీ బాధ్యులను చేస్తూ, చిన్నచిన్న తప్పిదాలకు సస్పెన్షన్లు, ఛార్జ్ మెమోలు ఇవ్వడం ఏమాత్రం సరి కాదని, ఉపాధ్యాయులు ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛ వాతావరణం లో పనిచేసినప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని , ఉపాధ్యాయులను అదే పనిగా వేధిస్తూ ఒత్తిడికి గురి చేస్తూ ఉంటే విద్యార్థులకు బోధన కుంటుపడుతుందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్ బాలాజీ లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు అదే పనిగా పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను అన్నింటికీ బాధ్యులు చేస్తూ కొన్ని జిల్లాల్లో సస్పెన్షన్ లో చేయడం, వందలాది మంది టీచర్లకు చార్జింగ్ మెమో లు ఇవ్వడం జరిగిందని ఇకనైనా , వాటిని వెంటనే ఉపసంహరించాలని, ఎలాంటి చర్యలు లేకుండా ఉపాధ్యాయులు గౌరవంగా, స్వేచ్ఛగాక పనిచేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీటి.కల్పలతారెడ్డికి వినతి పత్రం అందజేశారు.