PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ‌.. హార్ధిక్ ప‌టేల్ రాజీనామా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పాటీదార్ ఉద్యమ నేత, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్ధిక్ ప‌టేల్ పార్టీకి రాజీనామా చేశారు. 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్.. కొద్ది రోజులుగా పార్టీ విధానాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వ్యాఖ్యలను సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చిన హార్దిక్.. ఎట్టకేలకు బుధవారం పార్టీ నుంచి పక్కకు తానే స్వయంగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి పంపారు.

                               

About Author