హరిహర క్షేత్రంలో.. 18వ వార్షిక బ్రహ్మోత్సవం..
1 min readకార్తీక హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్నదానం
- భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు
కర్నూలు, పల్లెవెలుగు: మంచి మనస్సుతో సనాతన ధర్మాన్ని ఆచరిస్తే… వారు తలిచిన కార్యం తప్పక నెరవేరుతుందన్నారు కార్తీక హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ ఎం.డి. డా. చంద్రశేఖర్. నగరంలోని హరిహర క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి అర్చకులు వేదమంత్రోచ్చరణాల మధ్య స్వామి వారికి అర్చనలు, అభిషేకం, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక్ హాస్పిటల్ ఎండి, జనరల్ ఎండి. డా. చంద్రశేఖర్, గైనకాలజిస్ట్ డా.పార్వతి దేవి దంపతులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్తీక హాస్పిటల్ ఆధ్వర్యంలోభక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.