PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు.. కీల‌క పాత్ర‌లో బాల‌కృష్ణ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ‘కెజియఫ్’ సినిమాల్లో ఇనాయత్ ఖలీల్ పాత్రను నటుడు బాల‌కృష్ణ‌ పోషించాడు. ‘కెజియఫ్’ దర్శకుడైన ప్రశాంత్ నీల్‌కు అతడు దగ్గరి బంధువవుతాడు. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీర‌మల్లు’ లో బాలకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తన పాత్రకు సంబంధించిన విశేషాలను తాజాగా అతడు మీడియాకు వెల్లడించాడు. టాలీవుడ్ దర్శకుడైన క్రిష్ జాగర్లమూడి ‘హరి‌హర వీరమల్లు’ ను తెరకెక్కిస్తున్నాడు. బాలకృష్ణ నటించిన ఓ వెబ్ షో ‘మస్తీస్’ ను క్రిష్ చూశాడు. దీంతో ‘హరిహర వీరమల్లు’ లో ఓ పాత్రకు సంప్రదించాడు. రాజదర్బార్‌లో మంత్రి అయిన హకీం ఖాన్ అనే పాత్రను బాలకృష్ణకు ఇచ్చాడు. హైదరబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓడ సెట్ వేసి అతడిపై సన్నివేశాలను చిత్రీకరించారు.

                                             

About Author