NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శివశనామస్మరణతో మార్మోగిన హరిశ్చంద్ర శరీన్ నగర్…

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కార్తీకమాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం అటువంటి కార్తీకమాసం లో మూడవ సోమవారం రోజున హరిశ్ఛంద్ర శరీన్ నగర్ లో శ్రీ సద్గురు త్యాగరాజ రామాలయం ఓం సమఃశ్శివాయ అంటూ శివనామస్మరణతో మార్మోగి పోయింది.  శరీన్ నగర్ లోని శ్రీ సద్గురు త్యాగరాజ సీతా రామాలయ భజనకమిటి, మరియూ ప్రముఖ భజనవేత్త దాదిపోగు తిరుపాలు ఆధ్వర్యంలో సుమారు 30 భజన సంఘాలు పాల్గొనగా 24 గం.ల అఖండ భజన కార్యక్రమం ఉ.7:00 గం.ల నుండి మంగళవారం ఉ.7:00 గం.ల వరకు ఓం నమఃశ్శివాయ ఏకావహం కార్యక్రమం జరిగింది. తెల్లవారు ఝామున ఉ.5:00 గం‌.లకు ఆలయంలో సుప్రభాత సేవ, శ్రీ సీతా,రామ, లక్ష్మణ, ఆంజనేయ మూర్తులు తో పాటు త్యాగరాజుల వారి మూల విగ్రహాలకు ప్రధాన అర్చకులు మాళిగి భానుప్రకాష్ ఆధ్వర్యంలో  పంచామృతాభిషేకం,మహాభిషేకం,అలంకారం,ఆకుపూజ,నిర్వహించబడ్డాయి.

అనంతరం గణేశ ప్రార్థనతో అఖండ శివనామ సంకీర్తన ప్రారంభమైంది.అతిథులుగా పాల్గొన్న 29,30,31, వార్డుల కార్ఫోరేటర్లు సంగాల సుదర్శన్ రెడ్డి,జయరాముడు,శ్రీమతి చిట్టెమ్మ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారికి నిర్వాహకుడు దాదిపోగు తిరుపాలు శాలువా కప్పి, జ్ఞాపికతో సత్కరించారు.   ఆ తరువాత సుమారు 3 వేల మందికి అన్నదానం జరిగింది. సాయంకాలం నందికోల సేవ, ఆలయం చుట్టూ శ్రీ త్యాగరాజ స్వామి వారికి రథోత్సవం, ఆలయం వద్ద శ్రీమతి భార్గవి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆచారి,ఆలయకమిటీ అధ్యక్షుడు ఉదయప్రసాదు, నాగరాజు, వెంకటస్వామి,భజన కమిటీ సభ్యులు నర్సోజీ,నాగభూషణం,సీనివాసులు,తదితరులు పాల్గొన్నారు.

About Author