పరిషత్తు ఎన్నికల తీర్పు పై హర్షం
1 min readపల్లెవెలుగు వెబ్, ఆస్పరి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు లైన్ క్లియర్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు పట్ల వైకాపా మండల నాయకులు, జెడ్పిటిసి అభ్యర్థి, ఎంపిటిసి అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక బస్టాండు ఆవరణంలో వైకాపా శ్రేణులు బాణసంచా పేలుస్తూ, స్వీట్లు పంచి పెట్టుకుని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గాంధీ పార్కు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైకాపా మండల కన్వీనర్ సుంకర రామాంజనేయులు, మాజీ జెడ్పిటిసి మూలింటి బాలకృష్ణ, వైకాపా జిల్లా సంయుక్త కార్యదర్శి గోవర్ధన్, జడ్పిటిసి అభ్యర్థి దొరబాబు మాట్లాడుతూ మాట్లాడుతూ పరిషత్ ఎన్నికలకు గ్రహణం వీడిందన్నారు. ఎన్నికల కౌంటింగ్ కు లైన్ క్లియర్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాలకు చెంపపెట్టులాంటిదన్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో వైకాపా అభ్యర్థులు భారీ విజయాలతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో మాజీ చైర్మన్ కేశవరెడ్డి, వైకాపా మండల గౌరవ అధ్యక్షుడు చంద్ర శేఖర్ రెడ్డి, అశోక్ నాయుడు, ఎంపీటీసీ అభ్యర్థులు తిమ్మన్న, ప్రకాష్, వైకాపా నాయకులు రామంజిని, శ్రీరాములు, గఫుర్, విజయ్, ఆంజనేయులు, రంగన్న, తదితరులు పాల్గొన్నారు.