30 టన్నుల పిడిఎస్ బియ్యం పట్టివేత..
1 min readఅక్రమంగా పిడిఎస్ బియ్యం కొన్నా, అమ్మిన చట్ట ప్రకారం నేరం
వారిపై కఠిన చర్యలు – క్రిమినల్ కేసులు, బైండోవర్..
డిఎస్ ఓ హెచ్చరిక
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : అక్రమంగా పిడిఎస్ బియ్యం కొన్నా, అమ్మిన అమ్మినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ సత్యనారాయణ రాజు హెచ్చరించారు. సోమవారం చాట్రాయి మండలం డి పోలవరం గ్రామంలో అక్రమంగా రవాణా జరుగుతున్నదని విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా పౌరసరఫరాల అధికారి ఆర్ సత్యనారాయణ రాజు తమ సిబ్బందితో దాడి చేసి 30 టన్నుల పిడిఎస్ రైస్ ను స్వాధీనం చేసుకుని, లారీ యజమాని, డ్రైవర్ పై కేసులు నమోదు చేశారు. డి పోలవరం నగరు శివారు ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి , అనుమానాస్పదంగా ఉన్న TS 05 UC 2829 , అశోక్ లేలాండ్ లారీని బియ్యం లోడుతో ఉండుట గమనించి వెంటనే సదరు డ్రైవర్ చిలక రవికుమార్ ను బియ్యం నకు సంబంధించిన బిల్లులు, అనుమతి పత్రములను చూపించమని కోరగా సదరు వ్యక్తి ఏ విధమైన బిల్లులను చూపించక పోవుటచే లారీలో ఉన్న బియ్యం స్టాకులను పరిశీలించగా 30 టన్నులు కలిగి ఉన్న పని , వీటిపై విచారణ చేయగా సదరు బియ్యం కార్డుదారుల దగ్గర నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి తిరిగి బ్లాక్ మార్కెట్ నకు తరలిస్తున్నట్లు తెలియజేశాడన్నారు. ఈ విషయంపై విచారణ చేయగా కృష్ణ శివద్వీప్ మరియు పెద్దిరెడ్డి రామచంద్రరావు రాత్రి PDS బియ్యం కార్డుదారుల వద్ద నుండి కొను గోలు చేసి తిరిగి బ్లాక్ మార్కెట్లో అమ్ముటకు మా లారీని రవాణా చేయుటకు ఒప్పందం కుదుర్చుకున్నామని విచారణలో తెలియజేసాడని, నిత్యవసర వస్తువుల చట్టం 1955 మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ, 2018 చట్టం ప్రకారం సదరు 30 టన్నుల PDS బియ్యం అక్రమంగా రవాణా చేయుచున్న కృష్ణ శివదీప్, పెద్దిరెడ్డి రామచందర్రావు, డ్రైవర్ చిలక రవికుమార్ లపై 6A కేసు నమోదు చేయడం జరిగిందని, క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుందని జిల్లా పౌర సరఫరా అధికారి సత్యనారాయణ రాజు ఒక ప్రకటనలో తెలియజేసారు.