PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాల‌ని ఉంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాల‌ని ఉంద‌ని సినీ న‌టి , బీజేపీ నాయ‌కురాలు జ‌యప్ర‌ద తెలిపారు. స్వతహాగా తెలుగు మహిళను అయిన తనకు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ఆ దిశగా ముందుకు సాగుతానని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ గెలుపునకు పాటుపడతానని చెప్పారు. తెలంగాణ, ఏపీలో అధికారంలో ఉన్న పార్టీలు పాలనను గాలికి వదిలేశాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించిన తర్వాతే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆమె సూచించారు.

                                        

About Author