PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లను సిద్ధంగా ఉంచండి..

1 min read

జేసీ అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కోవిడ్, ఓమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనా బారిన పడిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లును సిద్ధంగా ఉంచుకోవాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్ వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రైవేట్ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, హాస్పిటల్ మేనేజ్మెంట్ నోడల్ కమిటీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఆసుపత్రుల సంసిద్ధతపై ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ….కొత్త వేరియంట్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనా బారిన పడిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ప్రాణవాయువు, బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ లు, హెల్ప్ డెస్క్, డీటైప్ సిలిండర్లు, పి ఎస్ ఏ ప్లాంట్లను ఇన్స్టలేషన్, వైద్య సిబ్బంది తదితర మౌలిక వసతులు సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత వైద్య సిబ్బందిని ఆదేశించారు. అన్ని వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రోగులకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో వుంచుకోవాలన్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాలు ప్రైవేట్‌ ఆసుపత్రులలోని బోర్డులలో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.రఘును ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా ఉంచి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు చేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.  ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కేసులు పెరిగేకొద్దీ ఆక్సిజన్ బెడ్స్ బ్లాకులను పెంచుకుంటూ పోవాలని డాక్టర్ ఇలియాజ్ ను ఆదేశించారు. కోవిడ్ కేర్ సెంటర్ లో తమ పరిధిలో ఉన్న వైద్య సిబ్బంది వెంటనే ఎంపిక చేయాలని డిసిహెచ్ ఎస్ డా.లింగన్నను జేసీ ఆదేశించారు.  ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రుల్లో ట్రాయేజింగ్ పక్కాగా జరగాలని ఆయన స్పష్టం చేసారు. ఆసుపత్రులలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని మౌలిక వసతులు సమకూర్చుకొని ఎలాంటి వేవ్ నైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా వుండాలన్నారు.  ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ రామ గిడ్డయ్య, జిల్లా కోవిడ్ నోడల్ ఆఫీసర్ కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రకాష్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ లింగన్న, హాస్పిటల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి డాక్టర్ ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author