ఎన్ హెచ్ ఏ ఐ నుంచి కీలక ప్రాజెక్టు ను పొందిన హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/2-5.jpg?fit=550%2C518&ssl=1)
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఇపిసి) కాంట్రాక్టింగ్ సేవలలో ప్రముఖ సంస్థ అయిన హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (హెచ్ఎంపిఎల్) (బిఎస్ఇ: 532467) కు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏ ఐ) నుండి ఒక కీలక ప్రాజెక్ట్ లభించింది. కంపెనీకి హులికుంటే ఫీ ప్లాజా వద్ద (సిహెచ్.12.300) వినియోగదారుల రుసుము వసూలు సంస్థగా వ్యవహరించే అధికారం ఈ-టెండర్ ద్వారా పోటీ ధరపద్ధతిలో ఎల్ఓఏ (లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్) రూపంలో లభించింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ. 67.16 కోట్లు. ఇది కర్ణాటకలోని దోబస్పేట్ నుండి దొడబళ్ళాపురం బైపాస్ వరకు (ఎన్ హెల్ 648, పాత ఎన్ హెచ్-207) నాలుగు లేన్ల రహదారి విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించినది.ఇటీవల, సంస్థ తన బోర్డు స్క్వేర్ పోర్ట్ షిప్‌యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ను హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌తో విలీనం చేయడానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ విలీనం ద్వారా వ్యాపార సామర్థ్యాలను సమీకరించడం, మరియు అన్ని ప్రయోజనదారులకు మెరుగైన లాభదాయకత అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాల రంగంలో హెచ్ఎంపిఎల్ ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. సంస్థ ఎంఎస్ఆర్డిసి సహా అనేక ముఖ్యమైన ప్రాజెక్టులను ఇపిసి మరియు హైబ్రిడ్ అన్యుటీ మోడల్ ద్వారా విజయవంతంగా పూర్తిచేసింది. 2019లో వాకన్-పాలి హైవే నిర్మాణాన్ని, కోవిడ్-19 సవాళ్లను ఎదుర్కొంటూ, విజయవంతంగా పూర్తి చేసింది. అంతేకాక, సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే ప్యాకేజీ 11, ఎన్ హెచ్ 48 హైవే ప్రాజెక్ట్ వంటి ప్రతిష్టాత్మక పనులను చేపట్టి తన నైపుణ్యాన్ని నిరూపించింది.తాజాగా, సంస్థ మౌలిక వనరుల ఇపిసి కాంట్రాక్టింగ్ విభాగంలో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇపిసి కాంట్రాక్టులను దృష్టిలో ఉంచుకుని, ప్రొఫెషనల్ సేవలను అందించేందుకు హెచ్ఎంపిఎల్ సిద్ధంగా ఉంది. దేశీయంగా మరియు అంతర్జాతీయంగా మౌలిక వనరుల రంగంలో మరింత పురోగమించేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకమైన మైలురాయి కానుంది.