NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాల‌య్య అల్లుడి ఓట‌మికి ప్రచారం చేశా.. ఆయ‌న నా కొడుకు విజ‌యానికి కృషి చేశారు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో నంద‌మూరి బాల‌కృష్ణ అల్లుడు నారా లోకేష్ ఓటమికి తాను ప్రచారం చేశాన‌ని అన్నారు ప్రముఖ న‌టుడు మోహ‌న్ బాబు. కానీ, బాల‌య్య త‌న కొడుకు విష్ణు ‘మా’ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి కృషి చేశార‌ని చెప్పారు. ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు గెలిచాక మోహ‌న్ బాబు బాల‌య్యను ఆయ‌న నివాసంలో క‌లిశారు. ఈనెల 16న విష్ణు ప్రమాణ స్వీకారానికి హాజ‌రుకావాల‌ని కోరారు. సినిప‌రిశ్రమ సమ‌స్యల‌పై బాల‌య్యతో చ‌ర్చించాన‌ని మోహ‌న్ బాబు చెప్పారు. బాల‌య్య ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి అని, స్వర్గీయ ఎన్టీఆర్ త‌న‌ను బాల‌య్య ఇంటికి పంపిన‌ట్టు ఉంద‌ని మోహ‌న్ బాబు అన్నారు. మా భ‌వ‌నం నిర్మించ‌డంలో విష్ణుకు బాలయ్య అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చార‌ని తెలిపారు.

About Author