ఆయనకు మోసకార్ అవార్డు ఇవ్వాల్సిందే !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీకి ప్రత్యేక హోదా పై ఆస్కార్ అవార్డుకు మించిన నటన జగన్ చేశారని, ఆయనకు మోసకార్ అవార్డు ఇవ్వాల్సిందేనని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్షంలో పెయిడ్ ఆర్టిస్టులతో ప్రత్యేక హోదా అంటూ డ్రామాలాడి ఇప్పుడు నోరు మెదపడంలేదని వ్యాఖ్యానించారు. జగన్ తన కేసుల మాఫీ కోసమే ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షను అమ్మేశారని అచ్చెన్న ఆరోపించారు. విభజన సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి.. మళ్లీ తొలగించడం వైకాపా లోపాయకారితనం, చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. తాడేపల్లి నుంచి ఢిల్లీ వరకు ప్రత్యేక హోదా అంశాన్ని ఎక్కడా వినపించకుండా నిషేధించారని దుయ్యబట్టారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేనప్పుడు ప్రజలిచ్చిన పదవుల్లో కొనసాగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. జగన్, వైసీపీ ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.