ఆయన ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవడం లేదు !
1 min readపల్లెవెలుగువెబ్ : వోలోడిమిర్ జెలెన్స్కీ నేతృత్వంలోని ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాము ప్రయత్నించడం లేదని రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా బుధవారం చెప్పారు. అమెరికా సహకారంతో ఉక్రెయిన్లో జీవాయుధాలను తయారు చేస్తున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అమెరికా రాజకీయ వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీ విక్టోరియా నూలాండ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన విషయాన్ని మారియా జఖరోవా ప్రస్తావించారు. బయలాజికల్ రీసెర్చ్ కోసం ప్రయోగశాలలు ఉక్రెయిన్లో ఉన్నాయని నూలాండ్ ధ్రువీకరించారని చెప్పారు. శాంతియుతంగా ఉపయోగించడం గురించి కానీ, శాస్త్రీయ లక్ష్యాల గురించి కానీ తాను మాట్లాడటం లేదన్నారు.