NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: గౌరవనీయులు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆదేశాలు ప్రకారం ఈరోజు ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం లో స్థానిక ఈ బీసీ కాలనీలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జిల్లా సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలకు తెలియజేస్తూ అమానుల్లా మాట్లాడుతూ 2024లో కాంగ్రెస్ పార్టీ ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే నిరుపేదలకు 6000 సహాయం చేస్తారు అలాగే రైతు రుణాలు మాఫీ ఆరు లక్షల వరకు మాఫీ చేస్తారని తెలియజేయడమైనది అదే విధంగా బిజెపి ప్రభుత్వం ఇప్పుడు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర 1300 ఉంటే కాంగ్రెస్ అధికారంలో వస్తే 500 కు సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా తెలియజేయడమైనది. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి మన ప్రియతమ నేత కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదాపై సంతకం చేస్తారని తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో హెచ్ పరసప్ప. ఎం కాసిం. ఎం బంట్రోల్ తిమ్మప్ప ఆలూరు నబి రసూల్ జోగి నరసప్ప కురువ ఈరన్న ఖాదర్ సాబ్ ఆలూర్ పిరా సాబ్ రామ మల్లేశప్ప కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

About Author