NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు.. ఎందుకో తెలిస్తే షాక్ !

1 min read
    ప‌ల్లెవెలుగువెబ్ :  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఓ వ్య‌క్తి సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. ఆయ‌న చేసిన నిర్వాకంతో ఊరు ఊరంతా నివ్వెర‌పోతున్నారు. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సామూహిక వివాహాలు జ‌రిపింది. వివాహం చేసుకున్న జంట‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం 35వేల న‌గ‌దు కానుక‌గా ఇచ్చింది. అందులో 20 వేలు పెళ్లి కూతురి బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. మిగిలిన డ‌బ్బును ఇత‌ర కానుకుల రూపంలో ఇస్తారు. వీటి కోసం ఆశ‌ప‌డిన ఓ వ్య‌క్తి సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. మెడ‌లో తాళిక‌ట్టాడు. ప్ర‌భుత్వం ఇచ్చిన డ‌బ్బు తీసుకుని పారిపోయాడు. పెళ్లి ఫోటోలు బ‌య‌టికి రావ‌డంతో ఊరి జ‌నం విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. 

About Author