NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆయ‌న‌కు పాక్ తో సంబంధాలు.. సీఎంని చేస్తే అంతే !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూకు పాక్ తో సంబంధాలు ఉన్నాయ‌ని, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ జావేద్ బ‌జ్వాల‌తో స్నేహం ఉంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కెప్టన్ అమ‌రీంద‌ర్ సింగ్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌దుప‌రి సీఎంగా సిద్ధూని ప్రతిపాదిస్తే తాను అంగీక‌రించ‌బోన‌ని అన్నారు. సిద్ధూ ఓ అస‌మ‌ర్థుడ‌ని, సీఎంని చేస్తే దేశ భ‌ద్రతకే ముప్పని ఆరోపించారు. ఒక్క మంత్రి ప‌దవి కూడ స‌మ‌ర్థవంతంగా నిర్వహించ‌లేక‌పోయాడ‌ని వ్యాఖ్యానించారు. పంజాబ్ సీఎంగా ఉన్న కెప్టన్ అమ‌రీంద‌ర్ సింగ్ పార్టీలో అంత‌ర్గత విభేదాల‌తో రాజీనామా చేశారు. సిద్దూను త‌దుప‌రి ముఖ్యమంత్రిగా ఎన్నుకునే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో కెప్టన్ వ్యాక్యలు రాజ‌కీయ క‌ల్లోలాన్ని సృష్టిస్తున్నాయి.

About Author