NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది అత‌నే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ప‌చ్చ‌ని కుటుంబాల‌ను విడదీయ‌డంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సిద్ధహ‌స్తుడ‌ని తెలంగాణ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ ఆరోపించారు. ఇప్ప‌టికే వైఎస్సార్ కుటుంబాన్ని స‌జ్జ‌ల విచ్ఛిన్నం చేశార‌ని ఆరోపించారు. త‌ల్లిని కొడుకును విడ‌దీసిన స‌జ్జ‌ల‌… అన్నను, చెల్లిని కూడా విడ‌దీశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. వైఎస్సార్ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసిన స‌జ్జ‌ల‌… ఇప్పుడు పచ్చ‌ని సంసారంలా సాగుతున్న కేసీఆర్ కుటుంబాన్ని విడ‌దీయ‌డానికి య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. వైఎస్సార్ ఫ్యామిలీని విడ‌దీసిన‌ట్లుగా కేసీఆర్ కుటుంబాన్ని స‌జ్జ‌ల విడ‌దీయ‌లేర‌ని గంగుల అన్నారు.

                                                

About Author