NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నా ప్రాణం కాపాడింది అత‌డే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ కెమెరా ముందుకు రాలేదు. అప్పుడ‌ప్పుడు ఫ్యామిలీ ఫంక్ష‌న్ల‌లో క‌నిపించ‌డం త‌ప్పితే పూర్తీ స్థాయిలో ప‌బ్లిక్ లోకి రాలేదు. తాజాగా త‌నకు రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన సంద‌ర్భంగా స‌హాయం చేసిన వారికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ఓ వీడియో విడ‌దుల చేశారు. ఈ సంద‌ర్బంగా సాయి మాట్లాడుతూ ..’గత ఆరు నెలల్లో చాలా నేర్చుకున్నాను. సంతోషం, ఆరోగ్యం, కుటుంబం ఇలా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ముందుగా నన్ను ఆస్పత్రిలో చేర్చిన సయ్యద్‌ అబ్దుల్‌ ఫరాఖ్‌కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మానవత్వం ఇంకా బతికుందనడానికి నిలువెత్తు నిదర్శనం మీరే. మీ వల్లే నేనింకా బతికున్నాను. అలాగే మెడికవర్‌, అపోలో ఆస్పత్రి, సిబ్బందికి కృతజ్ఞతలు. చిరంజీవి గారు, కల్యాణ్‌ గారు, నాగబాబు గారు, అరవింద్‌ గారు, చరణ్‌, బన్నీ, వరుణ్‌, వైషు, ఉపాసన… వీళ్లందరూ నాకోసం నిలబడ్డారు. నేను ఆస్పత్రిలో ఉన్నానని తెలిసి నాకోసం వచ్చిన నటీనటులు, దర్శకనిర్మాతలందరికీ థాంక్యూ సో మచ్‌“ అంటూ ముగించారు.

                                          

About Author