వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకనే టీడీపీలోకి
1 min readనెహ్రూనగర్ వైసిపి నాయకులు టిడిపిలో చేరిక
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకపోవడంతో వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరినట్లు నెహ్రు నగర్ నాయకులు తెలిపారు. పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామానికి చెందిన వైసిపి నాయకులు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.బుధవారం టీడీపీ మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర రెడ్డి , టీడీపీ నాయకులు పుల్యాల వాసు రెడ్డి ,పుల్యాల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వైసిపి పార్టీ 13వ వార్డు మెంబర్ మంగలి శేఖర్, 13వ వార్డు బిజెపి నాయకులు శివరాముడు, వైసిపి నాయకులు గోవిందు, లోకేశ్,లింగస్వామి, గోపాల్, మద్దిలేటి, నరసింహ, రవికుమార్, స్వామి, పక్కిర్ సాహెబ్, సాంబశివుడు, రంగస్వామి, బాలీశ్వర్, కుమ్మరి శేఖర్, శ్రీను, చాకలి రాముడు, రామస్వామి, వెంకటేశ్వర్లు, రాజేష్, మోహన్ నాయుడు, చంద్రశేఖర్, తిప్పారాజుల మధు తదితరులకు మాండ్ర శివానందరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు మేనిఫెస్టో నచ్చి టీడీపీ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు రామస్వామి,పగడం సోమ శేఖర్, శివ,పాలమర్రి నాగరాజు, మండల తదితరులు పాల్గొన్నారు.