ఆయన కరోన ఎప్పుడు అంతమవుతుందో చెప్పారు !
1 min readపల్లెవెలుగువెబ్ : చైనాకు చెందిన జోతిష్యుడు లియూ బోవెన్. ‘ద టెన్ వర్రీస్’ అనే పేరుతో ఉన్న కవితలో ఆయన భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ముందే లిఖించాడు. అందులో కరోనా పుట్టుకను, అంతాన్ని కూడా ఆయన అంచనా వేశారు. అది కచ్చితంగా కరోనా అనేఎలా చెప్పగలరంటే… ర్యాట్, క్యాట్ ఇయర్స్ మధ్య కాలంలో భయంకరమైన విపత్తు వస్తుందని, అది డ్రాగన్, స్నేక్ ఇయర్స్ మధ్యకాలంలో అంతమైపోతుందని ఆ కవితలో పేర్కొన్నాడు. చైనీస్ జొడియాక్ సంవత్సరాల ప్రకారం ర్యాట్ ఇయర్ 2019 ఫిబ్రవరిన మొదలైంది. పిగ్ ఇయర్ 2020 జనవరి 25న ప్రారంభమైంది. ఈ రెండేళ్ల మధ్య పుట్టిన విపత్తు… కరోనా వైరసే. చైనాలోని వుహాన్‌లో 2019 డిసెంబరు 1న తొలి కేసును గుర్తించారు. అది ఆయన చెప్పిన రెండేళ్ల మధ్య కాలమే. ఇక కరోనా అంతమైపోతుందని ఆయన చెప్పిన సంవత్సరాలు… డ్రాగన్ 2024లో ప్రారంభమవుతుండగా, స్నేక్ 2025లో మొదలవుతోంది. ఈ మధ్య కాలంలోనే పూర్తిగా కరోనా నశిస్తుందని పేర్కొన్నాడు. ఆయన చెప్పిందే నిజమవుతోందని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలేమీ లేవు. ఉండవు కూడా. అయితే ఆ కవిత బోవెన్ రాసినట్టు ఆధారాలు కూడా ఏమీ లేవన్న విమర్శ కూడా ఉంది.