PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూపాయి పంపించి.. 50 ల‌క్ష‌లు దోచేశాడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సైబర్ కేటుగాళ్ల మోసాలు ఆగడం లేదు.. అది కూడా నిరక్ష్యరాసులను కాదు.. బాగా చదుకున్న వారిని.. ప్రముఖులను, వ్యాపారవేత్తలను సైతం మోసం చేస్తున్నారు. క‌డ‌ప‌లో మ‌హేష్ శ‌ర్మ సిమెంట్ వ్యాపారం నిర్వ‌హిస్తున్నారు. ఓ రోజు అతడికి ఒక ఫోన్ కాల్ వ‌చ్చింది. అర్జెంట్ గా త‌న‌కు 100 సిమెంట్ క‌ట్ట‌లు పంపించాల‌ని మెటీరియ‌ల్ డెలివ‌రీ అయిన వెంట‌నే అక్క‌డ డ‌బ్బులు కూడా ఇచ్చేస్తామ‌ని చెప్పాడు ఆ వ్య‌క్తి. మ‌హేశ్ శ‌ర్మ చాలా ఆనందంతో పొద్దుపోద్దున్నే చాలా మంచి గిరాకి వ‌చ్చింద‌ని 100 సిమెంట్ క‌ట్ట‌లు లోడ్ చేయించి. స‌ద‌రు వ్య‌క్తి చెప్పిన అడ్ర‌స్ కు పంపించాడు. స‌ర‌కు డెలివ‌రీ కూడా అయ్యింది. వెంట‌నే మ‌ళ్లీ ఆ వ్య‌క్తి మ‌హేశ్ శ‌ర్మ‌కు ఫోన్​ చేసి మీరు పంపించిన స‌రుకు చేరుకుంది. డ‌బ్బులు ఎంతో చెప్పండి పంపిస్తామ‌ని నమ్మకంగా చెప్పాడు. అప్పటికే సంతోషంలో ఉన్న మ‌హేశ్ శ‌ర్మ 100 సిమెంట్ క‌ట్ట‌ల‌కు ఎంతైందో చెప్పాడు. మీరు అలాగే లైన్ లో ఉండ‌ండి మీ అకౌంట్ కు డ‌బ్బు పంపిస్తానని మొద‌ట ఒక రూపాయి మీ అకౌంట్ కు పంపించాను ఒక సారి క‌న్ఫామ్ చేయండి అని అన్నాడు అవ‌తలి వ్య‌క్తి. డీల్ అంతా స‌జావుగా సాగుతుంది క‌దాని కొంచెం కూడా అనుమానించ‌డ‌కుండ మ‌హేశ్ శ‌ర్మ త‌మ ఫోన్ లో స‌ద‌రు వ్య‌క్తి పంపించిన లింక్ తో ఉన్న ఒక రూపాయి డ‌బ్బును క‌న్​ఫాం చేశాడు. కానీ అంతలోనే ఊహించని షాక్ తగిలింది. అక్క‌డ నుంచి త‌న బిజినెస్​ అకౌంట్ లో ఉన్న 50 ల‌క్ష‌లు.. మాయమయ్యాయి. వెంట‌నే తేరుకుని తాను మోస‌పోయాని పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు మ‌హేశ్ శ‌ర్మ‌. ఇది ఒక మ‌హేశ్ శ‌ర్మ‌కు జ‌రిగిన మోస‌మే కాదు. ప్ర‌స్తుతం ఏపీలో చాలా మంది వ్యాపారస్తులు ఇదే విధంగా మోస‌పోతున్నారు.

                                          

About Author