బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలి : జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: బాగా చదువుకొని ఉన్నతి శిఖరాలు అధిరోహించాలని 10 పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ తెలిపారు.మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్ లోని కలెక్టర్ వారి చాంబర్లో కె.వి పల్లి మండలం ఏపీ మోడల్ స్కూల్ పదో తరగతి విద్యార్థులు 10 పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతం సాధించడంతో కలెక్టర్ ఆ విద్యార్థులను అభినందించారు. ఈ సౌమ్యశ్రీ 586, కే రెడ్డి భవ్య శ్రీ 571, ఏ ముని ప్రసన్న 570, కే రుచిత 565 మార్కులు రావడంతో ఆ విద్యార్థులకు జ్ఞాపికను కలెక్టర్ అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ….చదువును మధ్యలోనే నిలిపివేయకుండా ఆరు సంవత్సరాల వరకు బాగా కష్టపడితే కలెక్టర్ అవుతారని, లక్ష్యం పెట్టుకొని ఇప్పటినుంచే బాగా చదవాలన్నారు. ఇంటర్, డిగ్రీ, ఆపై ఉన్నత చదువులు చదివి సమాజానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, కె.వి పల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.