NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త‌ల న‌రికాడు.. రాత్రంతా మొండెం ప‌క్కనే ప‌డుకున్నాడు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: త్తర‌ప్రదేశ్ లోని ఘ‌జియాబాద్ లో దారుణం జ‌రిగింది. స‌హోద్యోగిపై కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి దారుణంగా హ‌త్య చేశాడు. ఓ ఆటోమొబైల్ అనుభంద సంస్థలో మెషిన్ ఆప‌రేట‌ర్ గా ప‌నిచేస్తున్న సందీప్.. త‌న పై ఉన్నతాధికారుల‌కు ఫిర్యాదు చేశాడ‌న్న కోపంతో ప్రమోద్ పై కక్ష పెంచుకున్నాడు. గ‌త ఆదివారం రాత్రి మందు పార్టీకి ఆహ్వానించాడు. పీక‌ల‌దాక మందు తాగారు. మ‌త్తులో ఉన్న ప్రమోద్ త‌ల‌ను తెగ‌న‌రికాడు. రాత్రంతా ప్రమోద్ మొండెంతోనే ప‌డుకున్నాడు. ఉద‌యాన్నే ప్లాస్టిక్ క‌వ‌ర్లో ప్రమోద్ త‌ల పెట్టి చెత్త కుప్పలో వేశాడు. భ‌ర్త ఎంతసేప‌టికి ఇంటికి రాక‌పోవ‌డంతో ప్రమోద్ భార్య సందీప్ ఇంటికి వ‌చ్చింది. దీంతో అసలు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

About Author