PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లావుగా ఉన్నాడని.. ఉద్యోగంలోంచి తీసేశారు !

1 min read

పల్లెవెలుగువెబ్ : లావుగా ఉన్నాడన్న కారణంతో ఉద్యోగంలో నుంచి తీసేసిన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన హమీష్ గ్రిఫిన్ క్వీన్స్‌లాండ్‌లో ఎనిమిదేళ్లుగా పార్క్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పైగా అతని సొంత ఇంటికి ఆఫీస్‌ సుమారు 3,200 కి.మీ దూరం. కాగా అతను ఇటీవలే ఆఫీస్‌కి దగ్గరగా ఉండేలా ఇల్లు కూడా మారాడు. అయితే ఉ‍న్నట్టుండి అతని కంపెనీ యజమాని నువ్వు చాలా లావుగా ఉ‍న్నావు పనిచేయలేవు అని చెప్పి విధుల నుంచి తొలగించేశారు. “కనీసం నా పని సమర్ధతను చూపించుకునే అవకాశం కూడా ఇ‍వ్వలేదు. కేవలం నేను లావుగా ఉ‍న్నాను కాబట్టి ఏ పనిచేయలేను అని నిర్ణయించారు. పైగా నాకు ఒక కొడుకు ఉ‍న్నాడు. ఈ ఏడాది అతని చదువు ఆగిపోతుంది.” అని గ్రిఫిన్ ఆవేదన వ్వక్తం చేశాడు.

      

About Author