NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌డ‌ప‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహ‌త్య

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌డ‌ప జిల్లా కోర్టు ఆవ‌ర‌ణ‌లోని కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ విజ‌య్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహ‌త్య చేసుకున్నారు. ఆయ‌న మంగ‌ళ‌వారం రాత్రి విధుల నిమిత్తం కంట్రోల్ రూమ్ కి వ‌చ్చారు. ఇవాళ ఉద‌యం కోర్టు సిబ్బంది చూసే స‌రికి ఫ్యాన్ కు వేలాడుతూ క‌నిపించారు. విష‌యాన్ని వెంట‌నే వ‌న్ టౌన్ పోలీస్ స్టేషన్ లో తెలియ‌జేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే సంఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న విజ‌య్ కుమార్.. ఆ కార‌ణంగా ఆత్మహ‌త్యకు పాల్పడి ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

About Author