PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హెడ్ కానిస్టేబుల్ రామారావుకు పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: నగరంలోని కంట్రోల్ రూమ్ హెడ్ కానిస్టేబుల్ కలతోటి రామారావు గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. రామారావు హఠాత్మరణం చెందడంతో పోలీసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. స్నేహశీలి రామారావు మరణించడంతో మాచవరం యరం వారి వీధిలోనున్న ఆయన స్వగృహం నందు ఆయనతో పాటు పనిచేసిన పలు డిపార్ట్మెంట్ పోలీసు ఉన్నతాధికారులు రామారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కంట్రోల్ రూమ్ ఏసిపి రాజశేఖర్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ వినయ్ మోహన్, పోలీస్ అసోసియేషన్ నాయకులు సోమయ్య లు.. రామారావు భౌతికఖాయాన్ని సందర్శించి పూలమాలతో నివాళులర్పించి పోలీసుల తరఫున రామారావు సతీమణి కలతోటి సుందరమ్మకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి అన్నివిధాలుగా అండదండలుగా ఉంటామని భరోసా ఇచ్చారు.. అనంతరం పోలీసు లాంచనాలతో రామారావు అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు.

About Author