నగరంలో తల చిత్ర యూనిట్ సందడి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: నగరంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్ సందడి చేశారు. తాను దర్శకత్వం వహించిన తల చిత్రం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించనుందని దర్శకుడు అమ్మ రాజశేఖర్ తెలిపారు. బందర్ రోడ్డు లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ తన కుమారుడు రాగిన్ రాజ్ ను హీరోగా పరిచయం చేస్తూ తల అనే చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ చిత్రం కోసం రెండేళ్ల పాటు కుటుంబమంతా కష్టపడినట్లు తెలిపారు. ఈ చిత్రం ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అమ్మ రాజశేఖర్ కచ్చితంగా కం బ్యాక్ ఇస్తారని ఆయన ప్రేక్షకులకు తెలియజేశారు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని, హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే ప్రేమ రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు.ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా కూడా పని చేశారని వివరించారు. పూర్తిస్థాయి మాస్ అండ్ యాక్షన్ చిత్రాన్ని తెలుగు తమిళ ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన లవ్ అండ్ యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ నగరం నుంచి తమ చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు.అనంతరం హీరో రాగిన్ రాజ్ మాట్లాడుతూ తన తండ్రి డైరెక్షన్లో హీరోగా వెండితెరకు పరిచయం అవడం సంతోషంగా ఉందని ఈ చిత్రంలో నా క్యారెక్టర్ యువతను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆయన చెప్పారు. యాక్షన్స్ అన్ని వేషాలు హాలీవుడ్ మాదిరిగా ఉంటాయని ప్రేమ రొమాంటిక్ సన్నివేశాలు యువతను అలరిస్తాయని వివరించారు.అనంతరం హీరోయిన్ నోరా ఎస్తేర్ మాట్లాడుతూ దర్శకుడు అమ్మ రాజశేఖర్ చెప్పిన కథ నచ్చి ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు చెప్పారు. చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా ఉంటుందన్నారు.అనంతరం ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాధ రాజశేఖర్ మాట్లాడుతూ దీప ఆర్ట్స్ పథకంపై ఈనెల 14వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీలో తన భర్త అమ్మ రాజశేఖర్ పనైపోయింది ఇక సినిమాలు చేయడం కష్టమని చాలా మంది భావించారని తల చిత్రంతో అమ్మ రాజశేఖర్ కం బ్యాక్ ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు.