NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైద్యం.. సరిగా అందుతుందా..!

1 min read

– కోవిడ్​ బాధితులను ఆరా తీసిన ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్యచికిత్సలు పొందుతున్న కోవిడ్​ బాధితులను నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ పరామర్శించారు. వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా.. వైద్యులు, సిబ్బంది స్పందిస్తున్నారా.. తదితర అంశాలపై రోగులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం జీజీహెచ్​లో 150 ఆక్సిజన్​ పడకలతో ఏర్పాటు చేసిన జగనన్న మైల్డ్ కేర్​ కోవిడ్​ సెంటర్​ను ఎమ్మెల్యే ఆకస్మికంగా పరిశీలించారు.

పీపీఈ కిట్లు ధరించి ఆస్పత్రి సూపరింటెండెంట్​ నరేంద్రనాథ్​ రెడ్డి, వైద్య సిబ్బందితోపాటు ఎమ్మెల్యే రోగుల వద్దకు వైద్యసదుపాయాలపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జిల్లాలో కోవిడ్ బాధితులకు పడకల కొరతను అధిగమించడంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం జర్మన్ హ్యాంగర్లతో నిర్మిస్తున్న తాత్కాలిక ఆసుపత్రి ని పరిశీలించారు.

About Author